Devara: టవల్ ను గిరా గిరా తిప్పుతూ ఎన్టీఆర్ దేవర స్టెప్పులును దించేసిన బామ్మ.. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కామెంట్స్

by Prasanna |   ( Updated:2025-01-18 12:19:52.0  )
Devara: టవల్ ను గిరా గిరా తిప్పుతూ ఎన్టీఆర్ దేవర స్టెప్పులును దించేసిన బామ్మ.. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ ( NTR ) హీరోగా తెరకెక్కిన " దేవర " ( Devara) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ. 500 కోట్లను కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. అయితే, మూవీలోని అన్ని పాటలు పెద్ద హిట్ అయ్యాయి. దేవర తాండవం అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎన్టీఆర్ టవల్ తో డ్యాన్స్ విరగదీశాడు. ఈ పాట రీల్స్ లో కూడా బాగా ఫేమస్ అయింది.

తాజాగా, ఓ బామ్మ ఎన్టీఆర్ ను మ్యాచ్ చేస్తూ ఈ సాంగ్ కి చిందులేసింది. ఆ సినిమాలో తారక్ ఎలా అయితే టవల్ పట్టుకుని గిరా గిరా తిప్పాడో .. ఈమె కూడా పచ్చ చీర కట్టుకుని టవల్ తో మాస్ స్టెప్పులు చించేసింది. ఇప్పటికీ, ఈ వీడియోను 7 లక్షలకు పైగా చూశారు. దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్లు కెవ్వు కేక, వందేళ్లు చల్లగా బతకాలి , మీరు ఈ వయసులో కూడా డ్యాన్స్ చేస్తున్నారు .. మీరు వేసే డ్యాన్స్ మూమెంట్స్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ( viral ) గా మారింది.

Read More : Pushpa 2: రష్మికను మ్యాచ్ చేస్తూ పీలింగ్స్ పాటకి స్టెప్పులేసిన 80 ఏళ్ల ముసలి బామ్మా ( వీడియో )

Advertisement

Next Story