మగధీర, బాహుబలి, RRR అన్నీ కలిస్తే "వారణాసి" మూవీ

by velandi.Saikiran |

జక్కన్న, మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగా అం

మగధీర, బాహుబలి, RRR అన్నీ కలిస్తే వారణాసి మూవీ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: జక్కన్న, మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో టైటిల్ టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సినిమాలో రెండు గెటప్ లలో మహేష్ బాబు నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నారట.

ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారణాసి సినిమా అద్భుతం సృష్టించబోతుందని వెల్లడించారు. మగధీర, ఈగ, బాహుబలి, RRR సినిమాలన్నీ కలిపితే కాదు మ‌ల్టిప్లై చేస్తే వారణాసి అంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇండస్ట్రీని షేక్ చేసేందుకు వారణాసి సినిమా వస్తుందని వెల్లడించారు. ఆ రేంజ్ లో రాజమౌళి ఈ సినిమాను తీస్తున్నారని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా వారణాసి సినిమాలో పృథ్వీ రాజ్ విల‌న్ గా క‌నిపించ‌నున్న‌ట్లు టాక్‌. ఇక ఈ సినిమాను 2027లో సంక్రాంతికి విడుద‌ల చేసే ప్లాన్ లో ఉన్నారు.

Next Story