- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Keerthy Suresh: సవాళ్లతో కూడుకున్నప్పటికీ ఆ క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా.. కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘మహానటి’ చిత్రంతో అమ్మడు తన పాపులారిటీని పెంచుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘మహానటి’ చిత్రంతో అమ్మడు తన పాపులారిటీని పెంచుకుంది. తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేయడంతో పాటు వరుస అవాకాశాలతో బిజీ అయిపోయింది. తెలుగు, తమిళ స్టార్ హీరోలతో చేసిన ఈ భామ పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసి ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోని తటిల్‌ను గత ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ‘బేబీ జాన్’(Baby John) చిత్రంలో కనిపించింది. పెళ్లైనప్పటికీ హానీమూన్ వెళ్లకుండా ప్రమోషన్స్ చేసింది. అయినప్పటికీ ఈ సినిమా హిట్ అందుకోలేదు. ఇక కొద్ది రోజుల నుంచి కీర్తి సురేష్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె నెట్‌ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇన్నాళ్లు బోల్డ్ సీన్స్‌లో అంతగా నటించిన కీర్తి ఈసారి మాత్రం రూట్ మార్చిందట. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రతి భాషకు సమాన ప్రాధాన్యత ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను. బహుళ భాషల్లో పని చేయడంతో సవాళ్లతో కూడుకున్నప్పటికీ ఈ క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా.
అంతేకాకుండా ఇది నా నటనా పరిధిని విస్తరించేందుకు సహాయపడుతుంది. ఒకప్పుడు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో ముందు వెనుక ఆలోచించేదాన్ని. కానీ కెరీర్ కోసం నా అభిమానుల కోసం ఎంత దూరం అయినా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. త్వరలో మరో రెండు తెలుగు చిత్రాలు, ఒక మలయాళ, ఒక తమిళ మూవీ కూడా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సెకండ్ ఇన్నింగ్స్ కలిసొచ్చేనా? అని అనుమానపడుతున్నారు.






