Aditi Rao Hydari: ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ ఆ ముఖ్యమైన ప్రయాణంలో భాగమయ్యా.. అదితి రావ్ హైదరి ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-26 12:18:50  IST  )

యంగ్ బ్యూటీ అదితిరావు హైదరి (Aditi Rao Hydari)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Aditi Rao Hydari: ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ ఆ ముఖ్యమైన ప్రయాణంలో భాగమయ్యా.. అదితి రావ్ హైదరి ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అదితిరావు హైదరి (Aditi Rao Hydari)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘ప్రజాపతి’(Prajapati) చిత్రంతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక మొదటి సినిమానే మమ్ముట్టితో నటించడంతో ఫుల్ క్రేజ్ వచ్చింది. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో ‘అంతరిక్షం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021లో మహాసముద్రంలో సిద్ధార్థ్ (Siddharth)సరసన నటించి ప్రేమలో పడింది. అయితే వీరిద్దరు కొంతకాలం సీక్రెట్‌గా ప్రేమించుకున్నారు. సడెన్‌లో ఓ ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత అఫీషియల్‌గా అనౌన్స్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అదివి రావు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా, ఈ భామ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ పెట్టింది. ‘‘ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ నేను కేన్స్‌కు వెళ్ళాను. ఈ సంవత్సరం కేన్స్‌కు నా చిన్న ప్రయాణం రోలర్ కోస్టర్ లాంటిది. ఆపై నేను గడిపిన ఒక రోజు తుఫానుతో కూడిన వర్షంలా మారింది. సూర్యుడి నుండి ఒక చూపు కూడా లేదు.. చాలా ఆందోళన చెందిన ముఖాలు ఉన్నాయి! కాబట్టి నేను వర్షపు రోజున నా సూర్యరశ్మిని కనుగొనడానికి బయలుదేరాను. జుట్టు కట్టుకుని, నా చెప్పులు విసిరివేసి, ఇసుకలో వృత్తాలు చేయడానికి బీచ్‌కి నడిచాను. సూర్యుడిని పిలిచాను, ఆయన కట్టుబడి ఉన్నాడు... సరైన సమయానికి... అది జరిగింది. రోజు చివరిలో మీ పాదాలు మురికిగా ఉండాలి. మీ జుట్టు గజిబిజిగా ఉండాలి.. మీ కళ్ళు మెరుస్తూ ఉండాలి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు నీతో వెదర్ కూడా ట్విన్నింగ్ చేసింది చాలా బాగున్నావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story