మరికొద్ది రోజుల్లో డెలివరీ.. అంతలోనే తల్లిని కోల్పోయిన పవన్ భార్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by I. Sairam |

యాంకర్‌గా, సీరియల్ నటిగా బుల్లితెర ఆడియన్స్‌కి బాగా దగ్గరైన అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరికొద్ది రోజుల్లో డెలివరీ.. అంతలోనే తల్లిని కోల్పోయిన పవన్ భార్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్‌గా, సీరియల్ నటిగా బుల్లితెర ఆడియన్స్‌కి బాగా దగ్గరైన అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సీరియల్ ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తన భర్త పవన్(Pawan), కూతురు ధన్విక(చందమామ)తో కలిసి అంజలి యూట్యూబ్ చానల్ రన్ చేస్తుంది. దీంట్లో వీళ్ల వీడియోలకి మంచి వ్యూస్ వస్తుంటాయి. ఇక సోషల్ మీడియా(Social Media)లో కూడా అంజలి-పవన్ జోడిగా మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ శుభ తరుణంలో ఓ శాడ్ న్యూస్ చోటుచేసుకుంది. అంజలి తల్లి మరణించింది. దీంతో ఈ చిన్నది తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

అందులో తన అమ్మ ఫొటోను షేర్ చేస్తూ.. ‘అమ్మా… నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నువ్వు ఇచ్చిన ప్రేమ, నీ చిరునవ్వు, నీ మాటలు- ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుండి దూరం చేసినా, మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు. నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలను దారి చూపిస్తుంది.. అమ్మ ఆత్మకు శాంతి కలగాలి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో పాపం ఇలాంటి సిట్యూవేషన్‌లో మీకు ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story