సమ్మర్ స్పెషల్‌గా ‘దీవాన’

by Chukka Sudharani |

శుభం సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’.

సమ్మర్ స్పెషల్‌గా ‘దీవాన’
X

దిశ, సినిమా: శుభం సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తుండగా.. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సమ్మర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుంచి ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్టోరీ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న ‘దీవాన’ హర్షిత్ రెడ్డి కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా కానుందని హామీ ఇస్తున్నారు టీమ్. కాగా.. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు.

Next Story