Paris: వెన్నెల రాత్రులు, రాళ్లతో కప్పబడిన వీధులు అంటూ అదిరిపోయే ఫొటోలు పంచుకున్న దీపికా పిల్లి

by Kodari Anjali |

యాంకర్ దీపికా పిల్లి(Anchor Deepika Pilli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Paris: వెన్నెల రాత్రులు, రాళ్లతో కప్పబడిన వీధులు అంటూ అదిరిపోయే ఫొటోలు పంచుకున్న దీపికా పిల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ దీపికా పిల్లి(Anchor Deepika Pilli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఢీ డ్యాన్స్‌షో (Dhee Dance Show) లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. కేవలం ఢీ షోకే మాత్రమే కాకుండా దీపికా పలు షోలకు కూడా యాంకర్‌గా వ్యవహరించింది. స్టార్టింగ్‌లో టిక్ టాక్‌ వీడియోలతో కూడా ఫుల్ పాపులర్ అయ్యింది.

తన క్యూట్‌నెస్‌తో నెటిజన్లను కట్టిపడేసిందనడంలో అతిశయోక్తిలేదు. టిక్ టాక్ దీపికా లైఫే మార్చిందని చెప్పుకోవచ్చు. ఢీ షోలో రష్మి గౌతమ్ (Rashmi Gautam) అండ్ దీపికా పిల్లి (Deepika pilli) తెగ సందడి చేశారు. తర్వాత ఢీ ప్రీమియర్స్ లీగ్ పేరుతో వచ్చిన షోన్ లో కూడా యాంకర్‌గా చేసింది. తర్వాత ఈ షోకు రిలేటెడ్‌గా వచ్చిన ఢీ బజ్ షోకు కూడా యాంకర్ గా వ్యవహించింది. మొత్తానికి టీవీ షోస్ కు యాంకరింగ్ చేసి బాగా పాపులర్ అయ్యింది.

బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తర్వాత ఈ అమ్మడు వెండితెరపై అవకాశాలు దక్కించుకుంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి ‘వాంటెడ్ పండుగాడు’ (Wanted festival) చిత్రంలో నటించి. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ అమ్మడు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు.

ఇకపోతే దీపికా పిల్లి తరచూ సోషల్ మీడియాలోని ఏదో ఒక పోస్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. హాట్ హాట్ అందాలతో దర్శనమిస్తుంటుంది. ఫ్యాన్స్ కోసం నిత్యం నెట్టింట తన పిక్స్ పంచుకుంటుంది. ఒక్కోసారి ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమివ్వగా.. ఒక్కోసారి గ్లామర్ ట్రీట్ ఇస్తూ మోడ్రన్ లుక్‌తో నెటిజన్లను మైమరపిస్తుంటుంది.

అయితే తాజాగా దీపికా పిల్లి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. వెన్నెల రాత్రులు, రాళ్లతో కప్పబడిన వీధులు అంటూ అదిరిపోయే ఫొటోలు పంచుకుంది. ఈ ఫొటోలు అన్ని చూస్తుంటే ఈ బ్యూటీ పారిస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. కేవలం మెరిసిపోతున్న పారిస్ (Paris) ఫొటోలు మాత్రమే కాకుండా తన పిక్స్ కూడా పంచుకుంది. బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. వీటితో పాటుగా ఫుడ్ ఐటెమ్స్ కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Next Story