అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కనకరత్నం కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-30 02:47:57  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కనకరత్నం కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నానమ్మ అల్లు కనకరత్నం (94) కన్నుమూశారు. వయసు మీద పడటంతో ఇవాళ తెల్లవారుజామున 1.45‌కు ఆమె తుది శ్వాస విడిచారు. అయితే, విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబై నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు, బంధువులు వెల్లడించారు.

ఇక మైసూర్‌లో షూటింగ్‌ బిజీగా ఉన్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) కాసేపట్లో అమ్మమ్మను కడసారి చూసేందుకు హైదరాబాద్‌కు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. కొడుకు అల్లు అరవింద్, అల్లుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దగ్గరుండి అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు వైజాగ్‌లో జనసేన భారీ బహిరంగ సభ ఉండటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రాకపై అనిశ్చితి నెలకొంది. అయితే, కనకరత్నం మృతి వార్తను తెలుసుకున్న పలువురు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి.. ఆమె మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. సెలబ్రిటీల తాకిడి ఎక్కువగా ఉండటంలో అల్లు అరవింద్ ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Next Story