మీ బాయ్‌ఫ్రెండ్‌కి నాన్న ఏజ్ ఉంటే.. ఇంట్రెస్టింగ్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే 2’తో బిజీగా ఉన్నాడు.

మీ బాయ్‌ఫ్రెండ్‌కి నాన్న ఏజ్ ఉంటే.. ఇంట్రెస్టింగ్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే 2’తో బిజీగా ఉన్నాడు. 2019లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘దే దే ప్యార్ దే’ కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో అజయ్ దేవ్‌గన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్‌లో వేగం పెంచగా.. వరుస అప్డే్ట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘దే దే ప్యార్ దే 2’ ట్రైలర్ రిలీజ్ చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘మీ BF మీ ఏజ్‌లో కాకుండా.. మీ నాన్న వయసులో ఉన్నప్పుడు.. మీకు తెలుసా..? దే దే ప్యార్ దే పోటీకి సమయం ఆసన్నమైంది’ అంటూ ట్రైలర్ విడుదల చేసింది. కాగా.. ఈ మూవీ భారీ అంచనాల మధ్య నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. లింక్


Next Story