ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ‘డెకాయిట్’

by Pulgam srinivas |

ప్రస్తుతం ‘డెకాయిట్’ ఇండియాలో ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ‘డెకాయిట్’
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు అడవి శేష్ తాజాగా నటించిన ‘డెకాయిట్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనే స్థాయి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘డెకాయిట్’ ఇండియాలో ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోకపోయినా, ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, షానీల్ డియో దర్శకత్వం వహించారు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.




Next Story