మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా

by Gantepaka Srikanth |

జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల(Theaters) మూసివేయాలని ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల(Theaters) మూసివేయాలని ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌(Film Chamber)లో ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమవేశమయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసివేత, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపివేత.. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో, ఈసారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే పైరసీ, ఐపీఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గిందనే అభిప్రాయానికి వచ్చారు. మే 30వ తేదీ నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలిపారు.

Next Story