రణ్‌వీర్ సింగ్‌ను చంపేస్తాం : బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

by Naga Rani Yarlagadda |

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కు బెదిరింపులొచ్చాయి. ఏడుతరాలు గుర్తుంచుకునేలా చంపుతామని దుండగులు ఆడియో మెసేజ్ పంపడం కలకలం రేపింది.

రణ్‌వీర్ సింగ్‌ను చంపేస్తాం : బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: రణ్‌వీర్ సింగ్‌ హీరోగా ఇటీవల విడుదలైన ధురంధర్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వసూళ్లు కురిపించింది. పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు మినహా మిగతా ప్రాంతాల్లో సినిమాకు ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులొచ్చాయి. అతన్ని, అతనివద్ద పనిచేస్తున్న వారిని చంపేస్తామంటూ వాట్సప్ లో ఓ వ్యక్తి వార్నింగ్ ఆడియో మెసేజ్ లు పంపాడు. హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి తనను తాను బిష్ణోయ్ ఫాలోవర్ గా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ డిమాండ్లు తీర్చకపోతే సిబ్బందిని కూడా చంపేస్తామని హెచ్చరించాడు. డైరెక్టర్ రోహిత్ శెట్టికి కూడా ఇవే బెదిరింపులు చేశాడు. ఏడుతరాలు గుర్తుండిపోయేలా రణ్‌వీర్ సింగ్‌ను చంపేస్తామని, తమ బెదిరింపుల్ని లెక్క చేయకుండా ఇతరులకు ఉచిత సలహాలివ్వడం మానుకోవాలని హెచ్చరించాడు. రణ్ వీర్ వద్ద పనిచేసేవాళ్ల లిస్ట్, వచ్చి వెళ్లే వాళ్ల లిస్ట్ అంతా తమ వద్ద ఉందని, ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి చంపితే అప్పుడైనా తామేంటో తెలుస్తుందని పేర్కొన్నాడు.

Next Story