David Warner : సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్

by Muthe.Rajitha |

ఆసీస్ సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

David Warner : సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసీస్ సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇన్నిరోజులు తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ అలరించిన వార్నర్.. ఓ తెలుగు సినిమాలో గెస్ట్ రోల్ చేసినట్టు సమాచారం. "రాబిన్ హుడ్"(RabinHud) సినిమాలో ఆయన అతిథి పాత్ర చేసినట్టు ఆ సినిమా నిర్మాత రవిశంకర్ ప్రకటించారు. హైదరాబాద్ లో నేడు జరిగిన "'కింగ్ స్టోన్"(Kingstone) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవిశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్, శ్రీలీల(Nitin-Srileela) జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్లో, మైత్రీ మూవీస్ బ్యానర్ పై రాబిన్ హుడ్ తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈనెల 28న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ అతిధి తళుక్కున మెరవనున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ లీడ్ రోల్ గా వస్తున్న 'కింగ్ స్టోన్' సినిమా ఈనెల 7న విడుదల అవుతోంది.

Next Story