- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. దానికంటే ముందే మేము ఆ పని చేశామంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘వినయ విధేయ రామ’(Vinaya Vidheya Rama) చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఇషా గుప్తా(Esha Guptha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘వినయ విధేయ రామ’(Vinaya Vidheya Rama) చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఇషా గుప్తా(Esha Guptha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. అలాగే స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేసింది. ఇక సోషల్ మీడియా(Social Media)లో ఈ చిన్నది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంది. బోల్డ్ షోతో రెచ్చ చేస్తుంది. దీంతో ఈ భామకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది.
ఇదిలా ఉంటే.. 2018లో ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)తో ఈ అమ్మడు డేటింగ్ చేస్తోందంటూ కొన్ని రూమర్స్ నెట్టింట షికార్లు చేశాయి. అయితే తాజాగా వీటిపై స్పందించి ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘హార్దిక్ నేను కొన్ని నెలలపాటు మాట్లాడుకున్నాము. వ్యక్తిగతంగా రెండు సార్లు మీట్ అయ్యాము. దాన్ని డేటింగ్ అనలేము. కానీ డేటింగ్ స్టేజ్‌కి ముందే మా బంధం తెగిపోయింది. ప్రస్తుతం అతనితో కాంటాక్ట్‌లో లేను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






