- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ నిజమే.. డైరెక్టర్ సెక్సువల్ ఫేవర్స్ అడిగాడు.. ముందే అగ్రిమెంట్ కూడా.. హీరోయిన్ సంచలనం
యంగ్ హీరోయిన్ దర్శనా బాణిక్ ‘ఆటగాళ్లు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బెంగాలీ నటి అయిన ఆమె.. నాగార్జున, నారా రోహిత్‌తోనూ తెలుగులో నటించింది. అయితే ఇక్కడ అంత సక్సెస్ కాపోయినా.. తెలుగు పరిశ్రమ గురించి గొప్ప విషయం చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ హీరోయిన్ దర్శనా బాణిక్ ‘ఆటగాళ్లు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బెంగాలీ నటి అయిన ఆమె.. నాగార్జున, నారా రోహిత్‌తోనూ తెలుగులో నటించింది. అయితే ఇక్కడ అంత సక్సెస్ కాపోయినా.. తెలుగు పరిశ్రమ గురించి గొప్ప విషయం చెప్పుకొచ్చింది. బెంగాలీ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్ తనను తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా వర్క్ చేస్తున్నావ్? ప్రాబ్లమ్ ఏమీ లేదా? అని అడిగాడని.. ఎందుకలా అడుగుతున్నారని ప్రశ్నించగా.. తనకు తెలిసిన మరో నటి ఇలాంటి కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపాడని చెప్పాడు. డైరెక్టర్‌కు సంబంధించిన ఫిమేల్ కాంట్రాక్టర్‌ను కలిసిందని.. ఆమె అగ్రిమెంట్స్, సెక్సువల్ ఫేవర్స్‌కు సంబంధించిన లిస్ట్ ఇచ్చిందని.. ఓకే అంటే హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లేనని చెప్పిందన్నాడని వివరించింది.
కానీ తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని.. మీరు రాంగ్ పర్సన్‌ను కలిసినట్లు ఉన్నారని స్పష్టం చేశానని తెలిపింది. ఇండస్ట్రీలో మంచి వాళ్లు ఉంటారు.. చెడ్డ వాళ్లు ఉంటారని.. ప్రతి పరిశ్రమలోనూ మంచి చెడు రెండూ ఉంటాయని అభిప్రాయపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. బాలీవుడ్‌లో ఇలాంటి నాన్సెన్స్, పీఆర్ స్టంట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






