- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డార్లింగ్ రీ-రిలీజ్ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను దుమ్ము దులిపిన ప్రభాస్
డార్లింగ్ చిత్రానికి రీ రిలీజ్ ద్వారా మొత్తం రూ. 11.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన డార్లింగ్ చిత్రాన్ని ఇటీవల భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేశారు. ఈ మూవీకి రీ రిలీజ్ సందర్భంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. దాంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం, ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా మొత్తం రూ. 11.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ మధ్య కాలంలో కొత్తగా విడుదలైన కొన్ని హిట్ సినిమాలకు కూడా ఈ స్థాయి కలెక్షన్లు రావడం లేదు. అలాంటి పరిస్థితిలో ఈ సినిమా ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడంతో ప్రభాస్ అభిమానులు భారీగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, కరుణాకరన్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాణం జరిగింది.






