హీరోయిన్ల బ్యూటీ వెనుక డార్క్ సీక్రెట్స్.. అంతా ప్లాస్టిక్ బొమ్మలేనా?

by Ajay Maddhiboyina |

ఓ డాక్ట‌ర్ టాలీవుడ్ లోని ప‌లువురు స్టార్ హీరోయిన్లు సైతం ప్లాస్టిక్ సర్జ‌రీలు చేయించుకున్న‌ట్టు చెప్పాడు. ఒక్క‌క్క‌రి ఫోటో చూపిస్తూ ఏ పార్ట్ కు స‌ర్జ‌రీ చేయించుకున్నారో చెప్పాడు.

హీరోయిన్ల బ్యూటీ వెనుక డార్క్ సీక్రెట్స్.. అంతా ప్లాస్టిక్ బొమ్మలేనా?
X

దిశ‌, వెబ్ డెస్క్: అందంగా క‌నిపించ‌డానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం ఈ రోజుల్లో కామ‌న్ అయిపోయింది. అయితే వీటివ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా చాలా మంది అవేం ప‌ట్టించుకోకుండా స‌ర్జ‌రీ చేసుకునేంద‌కు ఆస‌క్తి చూపిస్తున్నారు. సినిమా తార‌ల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. గ్లామ‌ర్ ఫీల్డ్ కాబట్టి ఏ పార్ట్ స‌రిగ్గా లేక‌పోయినా స‌ర్జరీ చేసుకుంటారు. అయితే ఓ డాక్ట‌ర్ టాలీవుడ్ లోని ప‌లువురు స్టార్ హీరోయిన్లు సైతం ప్లాస్టిక్ సర్జ‌రీలు చేయించుకున్న‌ట్టు చెప్పాడు.

ఒక్క‌క్క‌రి ఫోటో చూపిస్తూ ఏ పార్ట్ కు స‌ర్జ‌రీ చేయించుకున్నారో చెప్పాడు. అందులో స్టార్ హీరోయిన్ లు చాలా మంది ఉన్నారు. డాక్ట‌ర్ చెప్పిన మాట‌లు వింటే హీరోయిన్లంతా ప్లాస్టిక్ బొమ్మలేనా అనే అనుమానం రాక‌పోదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెడ్గే త‌న ముక్కుకు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్నార‌ట‌. అంతే కాకుండా పెద‌వుల‌కు లిప్ ఫిల్ల‌ర్స్, ద‌వ‌డ‌కు జాలైన్ కంటౌరింగ్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌ట‌. మ‌రో స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా బాటియా థ్రెడ్ లిఫ్ట్ స‌ర్జ‌రీ, లిప్ ఫిల్ల‌ర్స్ స‌ర్జ‌రీ, ఫ్యాట్ రిమూవ‌ల్ స‌ర్జ‌రీలు చేయించుకున్నార‌ట‌.

అంతే కాకుండా అన‌న్య పాండే రైనో ప్లాస్టీ, లిప్ ఫిల్ల‌ర్స్, చిన్ ఎన్ లార్జ్మెంట్, బేబీ బొటాక్స స‌ర్జ‌రీలు చేయించుకుంద‌ని చెప్పారు. హీరోయిన్ భూమి పెడ్నేక‌ర్ బ్రో లిఫ్ట్, రైనో ప్లాస్టీ, స్కిన్ లైటెనింగ్ స‌ర్జ‌రీలు చేయించుకుంద‌ని అన్నారు. అదే విధంగా సీతార‌మం బ్యూటీ మృణాల్ ఠాకూర్ స్కిన్ లైటెనింగ్ తో పాటు రైనో ప్లాస్టీ స‌ర్జ‌రీలు చేయించుకుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఇంత‌కాలం మ‌నం చూసి ఇష్ట‌ప‌డిన అందమంతా ప్లాస్టిక్ స‌ర్జ‌రీల‌దేనా అంటూ నెటిజ‌న్లు అభిమానులు షాక్ అవుతున్నారు.

Next Story