బంపర్ ఆఫర్ అందుకున్న దంగల్ సినిమా నటి.. థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్ర

by Mallepaka Hamsa |

బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) ‘చాచి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

బంపర్ ఆఫర్ అందుకున్న దంగల్ సినిమా నటి.. థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్ర
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) ‘చాచి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. షారుఖ్‌ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్‌తో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ‘దంగల్’(Dangal) సినిమాతో ఫాతిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్‌ను మంత్రముగ్దులను చేసింది. దీంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక గత ఏడాది ‘సామ్ బహదూర్’(Sam Bahadur) చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ఫాతిమా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.

జాతీయ అవార్డు-విజేత చిత్ర నిర్మాత మధుర్ భండార్కర్ (Madhur Bhandarkar)నిర్మాణంలో ఆమె ఓ థ్రిల్లర్ డ్రామా చేయబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ చెప్పగా.. అది విన్న ఫాతిమా నటించేందుకు సంతకం చేసినట్లు టాక్. హార్డ్-హిట్ షోబిజ్ డ్రామాలో భాగమైన మొదటి ప్రముఖ నటులలో ఈ నటి ఒకరు. అయితే ఈ చిత్రాన్ని భండార్కర్ ఎంటర్‌టైన్‌మెంట్, పిజె మోషన్ పిక్చర్స్‌పై దీనిని నిర్మిస్తున్నారు. ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. ఈ చిత్రం 2026 ప్రారంభంలో థియేటర్లలో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘వైఫ్స్ ఆఫ్ బాలీవుడ్’ టైటిల్‌తో రాబోతున్న ఈ థ్రిల్లర్ డ్రామా స్టార్ హీరోల భార్యలు గడుపుతున్న కనిపించని గ్లామరస్ జీవితాలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

Next Story