- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీపుల్స్ ‘ఛాంపియన్’.. సక్సెస్ మీట్
స్వప్న సినిమాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛాంపియన్'. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్

దిశ, సినిమా : స్వప్న సినిమాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛాంపియన్'. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో రోషన్... ‘మీడియా అందరికీ థాంక్యు సో మచ్. ఛాంపియన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. స్వప్న అక్క నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. తనకి సినిమా అంటే చాలా పాషన్. సినిమా కోసం ఏమైనా చేస్తుంది. మా నిర్మాతలు అందరికీ థాంక్యూ సో మచ్. కళ్యాణ్ చక్రవర్తితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన డైరెక్టర్‌కు థాంక్యూ’ అని తెలిపాడు. కార్యక్రమానికి హీరోయిన్ అనస్వర రాజన్, డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం, ప్రొడ్యూసర్ స్వప్న దత్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ తదితరులు పాల్గొన్నారు.






