Shivaji: ‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్.. విల‌క్షణ న‌టుడు లుక్‌కు నెటిజన్లు ఫిదా

by Chukka Sudharani |

‘క‌ల‌ర్ ఫోటో’ (Color photo), ‘బెదురులంక 2012’ (Beduru Lanka 2012) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల‌ను నిర్మించి

Shivaji: ‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్.. విల‌క్షణ న‌టుడు లుక్‌కు నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా: ‘క‌ల‌ర్ ఫోటో’ (Color photo), ‘బెదురులంక 2012’ (Beduru Lanka 2012) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’ (Dandora). ముర‌ళీకాంత్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ బీట్ వీడియోకు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మను పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చ‌క్కటి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఆవిష్కరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. ఇక రీసెంట్‌గా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్. 25రోజుల పాటు కంటిన్యూగా జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో విల‌క్షణ న‌టుడు శివాజీ (Shivaji) పాల్గొంటున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. శివాజీ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వరలో తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్.

Next Story