నిజ జీవిత అనుభవమే ‘దండోరా’

by Sujitha Rachapalli |

వైవిధ్యమైన చిత్రం ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు కీలకపాత్రల్లో కనిపించోతున్నారు.

నిజ జీవిత అనుభవమే ‘దండోరా’
X

దిశ, సినిమా : వైవిధ్యమైన చిత్రం ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు కీలకపాత్రల్లో కనిపించోతున్నారు. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 25న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడిన నిర్మాత.. ‘దండోరా’ లాంటి ఓ డిఫ‌రెంట్ పాయింట్‌ను ముర‌ళీ కాంత్‌తో చేయాల‌ని అనిపించడానికి కారణాన్ని వివరించాడు. ‘చాలా తక్కువ కథలను ఎమోష‌న్స్‌తో కొన్ని పాయింట్స్‌ను కొంత మంది మ‌న‌కు చెప్పినప్పుడు.. ఆ క‌థ‌ను రాసిన వాళ్లే అంత గొప్పగా సినిమాను తీయ‌గ‌ల‌ర‌ని అనిపిస్తుంది. చాలా జోన‌ర్స్ ఉంటాయి.. చాల క‌థ‌లు వ‌స్తుంటాయి. కాక‌పోతే మ‌నుషుల గురించి, మ‌నం బ‌తికే విధానం గురించి.. మ‌న క‌ళ్ల ముందున్న సమస్యల గురించి.. మ‌న సోసైటీలో జ‌రిగే కొన్ని విష‌యాలను అనుభ‌వించినోడే చెప్ప‌గ‌ల‌డు.. సినిమాగా చేయ‌గ‌లడు. ముర‌ళీకాంత్ నాకు క‌థ చెప్పిన‌ప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను’ అని చెప్పాడు ప్రొడ్యూసర్.

Next Story