- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కల్కి’ సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
అగ్రకథానాయకులు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి సినిమా(Kalki Movie)కు మరో అరుదైన గౌరవం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రకథానాయకులు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి సినిమా(Kalki Movie)కు మరో అరుదైన గౌరవం లభించింది. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2025’ వేడుక ముంబై నగరంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఉత్తమ నటుడిగా బాలీవుడ్ యాక్టర్ కార్తిక్ ఆర్యన్, ఉత్తమ నటిగా కృతిసనన్ అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా ‘కల్కి 2898 ఏడీ’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా, ‘స్త్రీ 2’ బెస్ట్ మూవీగా నిలిచాయి. ఉత్తమ దర్శకుడిగా కబీర్‌ఖాన్, ఉత్తమ నిర్మాతగా దినేశ్ విజన్, ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ఏఆర్ రెహమాన్ నిలిచారు. కాగా, సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించింది. దిగ్గజ దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం అతిథి పాత్రల్లో మెరిశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.






