లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’

by Sujitha Rachapalli |

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘డెకాయిట్’తో అలరించబోతున్నారు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు

లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’
X

దిశ, సినిమా : వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘డెకాయిట్’తో అలరించబోతున్నారు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. కాగా శేష్ పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లవ్ స్టోరీ, రూత్ లెస్ జర్నీ, ఒక పెద్ద లక్ష్యంతో నడిచే హీరోని ప్రజెంట్ చేస్తోంది. ప్రేమ, దోపిడీ ఈ రెండు ప్రధాన అంశాల చుట్టూ కథనం అద్భుతంగా వుంది. మొదటిసారిగా మాస్-ఓరియెంటెడ్ పాత్రలో కనిపించిన అడివి శేష్ అదరగొట్టారు. మల్టీ షేడ్స్‌తో.. రగ్గడ్ అవతార్‌లో హీరో కనిపించిన తీరు అదిరిపోయింది. మదనపల్లె యాసలో మాట్లాడిన విధానం ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ పాత్ర శేష్ పాత్రతోపాటు ప్రయాణిస్తూ.. అమాయకత్వం, ఎమోషన్ మధ్య ఊగిసలాడుతూ కథనానికి డెప్త్‌ను జోడిస్తుంది. టీజర్ అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్‌లను కీలక పాత్రలలో పరిచయం చేస్తుంది. అనుభవజ్ఞులైన నటుల అద్భుతమైన తారాగణం శక్తివంతమైన ఆన్-స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధంగా వుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాంకేతికంగా టీజర్ అత్యున్నతంగా వుంది.

Next Story