- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
iBOMMA రవికి జాబ్ ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన డీసీపీ!
ఐబొమ్మ రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పందించారు. రవికి జాబ్ ఆఫర్ చేశామని చెప్పడం అవాస్తవం అని కొట్టిపారేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఐబొమ్మ రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ సమయంలో రవికి జాబ్ ఆఫర్ చేయగా సున్నితంగా తిరస్కరించాడని ప్రచారం జరిగింది. అంతేకాకుండా బైయిల్ పై బయటకు వచ్చిన తరవాత కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ ప్రారంభిస్తానని రవి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పందించారు. రవికి జాబ్ ఆఫర్ చేశామని చెప్పడం అవాస్తవం అని కొట్టిపారేశారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవ కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చాడని వెల్లడించారు.
తప్పు చేశానన్న బాధ రవిలో అసలే లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రవి మూడు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్టు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని వివరించారు. ఇదిలా ఉంటే తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ ఐబొమ్మలో అప్ లోడ్ చేస్తున్న కేసులో పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రవి రిమాండ్ లో ఉండగా బెయిల్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాడు. బెయిల్ వస్తే రవి మళ్లీ ఐబొమ్మను ప్రారంభించకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.






