- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
RENUDESAI: కూతురితో క్యూట్ సెల్ఫీ దిగిన రేణుదేశాయ్.. అతను లేకుండా అంటూ షాకింగ్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ గురించేనా?
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రక్షాబంధన్ సందర్భంగా రేణుదేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి తీసుకున్న క్యూట్ పిక్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. అంతేకాకుండా ‘రాఖీ సెల్ఫీస్ వితౌట్ ది భయ్యా’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది చూసిన నెటిజన్లు పవన్ కళ్యాణ్ కూడా మిస్ అయ్యారు. అకీరా, పవన్ అన్న ఉండుంటే ఫ్రేమ్ ఇంకా అదిరిపోయేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ పిక్‌ను చూసేయండి.