- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allu Arjun: అల్లు అర్జున్ కి కొడుకు అయాన్ రాసిన క్యూట్ లెటర్.. దానిలో ఏముందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన "పుష్ప 2"

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన "పుష్ప 2" మూవీ నేడు దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ ( Pushpa 2: The Rule) థియేటర్లలో సందడీ చేస్తుంది. కొన్ని ఏరియాల్లో డిసెంబర్ 4 రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. కొన్ని చోట్ల గురువారం (డిసెంబర్ 5) తెల్లవారుజామున 4 గంటల నుంచి ‘పుష్ప 2 ది రూల్’ షోలు పడ్డాయి.
మూడేళ్ల తర్వాత థియేటర్ లో బన్నీ ని స్క్రీన్ మీద చూసి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఎంతలా కష్టపడ్డాడో కొడుకు అయాన్ ( Ayaan) , కూతురు అర్హలు( Arha) దగ్గర్నుండి చూసే ఉంటారు. ఇక అయాన్ తన తన ప్రేమను వ్యక్తపరచడానికి ఓ క్యూట్ లేఖను రాశాడు. దాన్ని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
"డియర్ నాన్నా.. నేను ఎంత సంతోషంగా ఉన్నానో.. ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానో చెప్పడానికి ఈ లెటర్ ని రాస్తున్నాను.. నీ కష్టం, డెడికేషన్ చూస్తే నాకు గర్వంగా ఉంటుంది.. నాన్న నువ్వెప్పుడూ నాకు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంటావ్.. ఈ రోజు పుష్ఫ 2 విడులవ్వనుంది.. ఈ రోజు చాలా స్పెషల్ .. నీకు పుష్ప అనేది కేవలం మూవీ కాదు.. అదోక జర్నీ అని నాకు తెలుసు.. నీకు యాక్టింగ్ పట్ల ఉన్న ప్యాషన్‌కు పుష్ప గొప్ప ఉదాహరణం.. బెస్ట్ ఆఫ్ లక్ నాన్నా.. పుష్ప 2 రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నువ్వే నా రియల్ హీరోవి నాన్నా.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా.. కాదు.. వైల్డ్ ఫైర్.. వరల్డ్ లోని ఓ ప్రౌడెస్ట్ సన్ బుజ్జి బాబు.. ఓ ఐడల్, నాన్నకి ప్రేమతో రాస్తున్నా లేఖ" అంటూ లెటర్ లో రాసుకొచ్చాడు. ఈ లెటర్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి " నా హృదయాన్ని ఈ లేఖ టచ్ చేసిందంటూ .." తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు.






