- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ
డిఫరెంట్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎలెవన్’.

దిశ, సినిమా: డిఫరెంట్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎలెవన్’. లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో.. రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవి వర్మ, కిరీటి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎ.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ‘ఎలెవన్’ మూవీ గత నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.
ఇక ఈ సినిమా కథ విషాయానికి వస్తే.. విశాఖపట్నంలోని జరిగే వరుస హత్యలు పోలీసులుకు నిద్ర లేకుండా చేస్తాయి.. అప్పటికే ఈ కేస్ డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ శశాంక్‌కు ప్రమాదం జరగడంతో.. ఆయన ప్లేస్‌లో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు నవీన్ చంద్ర రంగంలోకి దిగుతాడు. అయినా హత్యలు ఆగకుండా జరుగుతూనే ఉంటాయి.. అంతే కాకుండా హత్యకు గురైన వారి ఆనవాళ్లు కూడా దొరకవు. దీంతో నవీన్ చంద్ర ఎలా కిల్లర్‌ను పట్టుకుంటాడు అనేది ఎంతో ఆసక్తికంగా సాగుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీపై అనౌన్స్‌మెంట్ రావడంతో ప్రేక్షకులు ఖుష్ అవుతున్నారు.






