Nithiin: క్రియేటివ్ అండ్ క్రేజీగా తమ్ముడు ట్రైలర్ అప్డేట్.. ఆకట్టుకుంటోన్న వీడియో

by Chukka Sudharani |

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్న చిత్రం ‘తమ్ముడు’.

Nithiin: క్రియేటివ్ అండ్ క్రేజీగా తమ్ముడు ట్రైలర్ అప్డేట్.. ఆకట్టుకుంటోన్న వీడియో
X

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్న చిత్రం ‘తమ్ముడు’. నితిన్ (Nithiin) హీరోగా నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నా ఈ సినిమా జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు క్రియేటివ్‌గా, ఎంటర్‌టైనింగ్ వీడియోతో తెలిపారు. ఫన్నీగా డిజైన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇక ఈ వీడియోలో.. తాను గట్టిగా అడిగినందు వల్లే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించారని, ట్రైలర్ రిలీజ్ చేయమని అడిగితే చేస్తారని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పగా, తాను అడిగితేనే మూవీ రిలీజ్ డేట్ చెప్పారని లయ అంటుంది. వీళ్లిద్దరితో పోటీ పడుతూ స్వసిక విజయన్, సప్తమి గౌడ, బేబి శ్రీరామ్ దీత్య తాము చెప్పడం వల్లే "తమ్ముడు" మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారని అంటారు. ఇలా వీళ్లు గొడవ పడుతుండగా, దర్శకుడు శ్రీరామ్ వేణు వచ్చి 'మీ డౌట్స్ అన్నీ క్లారిఫై కావాలంటే ట్రైలర్ చూడండి.' అని చెప్తాడు.

Next Story