- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్డేట్.. విపరీతంగా ఆకట్టుకుంటోన్న పవర్‌స్టార్ లేటెస్ట్ లుక్
పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. 2023లో ప్రారంభమైన ఈ మూవీ కూడా పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లోకి వెళ్లడం ద్వారా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. 2016లో విడుదలైన తమిళ్ సినిమా తేరి ఆధారంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.
ఇందులో పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర పోస్టర్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్ క్రేజీ క్లైమాక్స్ ఎపిసోడ్ పవన్‌పై రూపొందించినట్లు సీన్లతో కంప్లీట్ అయినట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు మేకర్స్.
‘‘ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా క్యాబినెట్ సమావేశాలు, బాధ్యతలు ఉన్నప్పటికీ, హరి హర వీర మల్లు ప్రెజెంటేషన్లలో పాల్గొన్నప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేశారు. ఇది ఆయన అంకితభావం. అలాగే కష్టపడి పనిచేసే స్వభావానికి నిదర్శనం. ఇప్పుడు ఉస్తాద్భగత్ సింగ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. భావోద్వేగమైన, యాక్షన్‌తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్‌తో ముగిసింది. అని తెలిపారు. ఈ పోస్ట్‌లో కనిపిస్తోన్న పవన్ కల్యాణ్ లేెటెస్ట్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.






