- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శ్రీనివాస మంగాపురం’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్(ట్వీట్)
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అన్న రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram). ఈ క్రేజీ ప్రాజెక్టును RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని(Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది.
లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్(P.Kiran) నిర్మిస్తుండగా.. అశ్వనీదత్(Ashwin dutt) సమర్పిస్తున్నాడు. జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ రాబోతుందంటూ మూవీ టీమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఇది 2026 లో అతిపెద్ద అరంగేట్రం కానుంది.. జనవరి 10వ తేదీ ఉదయం 10:30 గంటలకు శ్రీనివాసమంగాపురం యొక్క ఇంటెన్స్ ఫస్ట్ లుక్ కోసం సిద్ధంగా ఉండండి’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
Read More..
హాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్






