- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ నెక్స్ట్ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్
రామ్ కొత్త సినిమా అప్‌డేట్‌ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: రామ్ పోతినేని నెక్స్ట్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ బృందం మే 15వ తేదీ ఉదయం 10:08 గంటలకు రామ్ కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ విడుదల చేయబోతున్నామని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో జాకెట్ వేసుకున్న ఓ చెయ్యి కనిపిస్తోంది. ఆ చేతిలో ఒక మైక్ ఉండగా, చేతి నుంచి భారీగా రక్తం కారుతూ మైక్‌పై పడుతున్నట్లు చూపించారు. దీంతో ఈ సినిమా రక్తపాతం, ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉండబోతుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రంతోనే రామ్ దర్శకుడిగా మారబోతున్నారని, ఆయన మెగాఫోన్ పట్టనున్న విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా ఈ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారని మరికొందరు భావిస్తున్నారు. ఇప్పటివరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్ ఈ సినిమాకు తానే కథ రాసుకొని దర్శకత్వం కూడా వహించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాను రామ్ సోదరుడు కృష్ణ చైతన్య నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.






