పవన్ కల్యాణ్ ‘OG’ నుంచి క్రేజీ అప్డేట్

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ(OG Movie).

పవన్ కల్యాణ్ ‘OG’ నుంచి క్రేజీ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ(OG Movie). దీనికి యంగ్ డైరెక్టర్ సుజిత్(Sujeeth) దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌ పాత్ర పోషించారు. వచ్చే సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ కాగా, ప్రస్తుతం డబ్బింగ్స్‌ కూడా పూర్తయ్యాయట. అంతేకాదు.. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసేందుకు సూపర్ యాక్షన్ టీజర్‌ను కూడా కట్ చేశారట. ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని నెట్టింట్ల కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

Next Story