- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhil: లెనిన్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. మరోసారి ఐటెమ్ సాంగ్‌లో రెచ్చిపోనున్న బ్యూటీ
అక్కినేని హీరో అఖిల్ వరుస ప్లాప్స్ తర్వాత చెయ్యబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘లెనిన్’.

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్ వరుస ప్లాప్స్ తర్వాత చెయ్యబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫిక్స్ చేశారు. కొన్ని అనివార్య కారణాల చేత శ్రీలీల తప్పుకోగా.. భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే.. ఇప్పటి వరకు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ తరుపరి షెడ్యూల్ కోసం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ఐటెం సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ స్పెషల్ సాంగ్ కోసం టాప్ హీరోయిన్‌ను తీసుకోవడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. దాదాపు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దేను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ పాట పాడటానికి సింగర్ మంగ్లీని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే.. వీటిలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. లింక్






