- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య–కొరటాల సినిమాకు క్రేజీ టైటిల్
బాలయ్య–కొరటాల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు “కార్పెంటర్” అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నట సింహం బాలకృష్ణ త్వరలోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “కార్పెంటర్” అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్‌ను ఫైనల్ చేసి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
“కార్పెంటర్” అనే టైటిల్ వార్త బయటకు రావడంతో బాలయ్య అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ టైటిల్ బాలయ్య ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని, చాలా డిఫరెంట్‌గా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య – కొరటాల శివ కాంబినేషన్ అనగానే ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి మరియు కొరటాల శివ కలిసి నిర్మిస్తున్నారు.






