‘భద్రకాళి’ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. రెండు చేతుల్లో పిస్టల్‌తో భయపెట్టిస్తున్న స్టార్ హీరో

by Gugulothu.Kavitha |

హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్న విజయ్ ఆంటోని(Vijay Antony) మనందరికీ సుపరిచితమే.

‘భద్రకాళి’ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. రెండు చేతుల్లో పిస్టల్‌తో భయపెట్టిస్తున్న స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్న విజయ్ ఆంటోని(Vijay Antony) మనందరికీ సుపరిచితమే. ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా తెరకెక్కతున్న ‘భద్రకాళి’(Bhadrakali) మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఇక దీన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని అందిస్తున్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తెలుగులో ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఇక పోస్టర్‌‌ను గమనించినట్లయితే.. విజయ్ ఆంటోనీ నేలపై కూర్చుని, రెండు చేతుల్లో పిస్టల్ పట్టుకుని, భయంకరమైన లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక అతని వెనుక ఒక ఎర్రటి ఆకాశంలో తెల్లని చంద్రుడు పెద్దదిగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్‌లో పురాతన ఆలయ గోపురాలు మరియు చారిత్రాత్మక నిర్మాణాల ఛాయాచిత్రాలతో ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. Link

Next Story