- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నారి నారి నడుమ మురారి’ మూవీలో క్రేజీ హీరో.. అఫీషియల్ వీడియోతో హైప్ పెంచిన మూవీ టీమ్
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ అంచనాలను పెంచగా.. తాజాగా ఈ మూవీలో టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు(Srivishnu) యాక్ట్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ఒక ప్రత్యేక జోడింపు, ఒక ప్రత్యేక ప్రకటన.
నారి నారి నడుమ మురారిలోకి ఎంటర్టైన్మెంట్ రాజు శ్రీ విష్ణు గారిని స్వాగతించడానికి వేదిక సిద్ధమైంది. నవ్వుల భారానికి సిద్ధంగా ఉండండి. జనవరి 14 నుండి థియేటర్లలో చూడండి’ అని రాసుకొచ్చారు. ఇక వీడియోలో కారులో నుంచి శ్రీ విష్ణు గాగుల్స్ పెట్టుకుని ఫార్మల్ డ్రెస్సులో స్టైల్‌గా దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






