‘sharwa-38’ లోకి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ బ్యూటీ.. అన్ని అంచనాలను బద్దలు కొట్టే పాత్ర కోసం ఈమెను స్వాగతిస్తున్నామంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ప్రజెంట్ ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) మూవీతో పాటు ‘శర్వా-38’(Sharwa-38) అనే మూవీలో కూడా నటిస్తున్నాడు.

‘sharwa-38’ లోకి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ బ్యూటీ.. అన్ని అంచనాలను బద్దలు కొట్టే పాత్ర కోసం ఈమెను స్వాగతిస్తున్నామంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ప్రజెంట్ ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) మూవీతో పాటు ‘శర్వా-38’(Sharwa-38) అనే మూవీలో కూడా నటిస్తున్నాడు. 1960లో తెలంగాణ - మహారాష్ట్ర బార్డర్‌లో జరిగే పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందబోతున్న ఈ మూవీకు సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘శర్వా, సంపత్ బ్లడ్ ఫెస్ట్ అనే గ్రామీణ ప్రపంచానికి నిప్పులు చెరుగుతోంది.. అన్ని నియమాలు మరియు అంచనాలను బద్దలు కొట్టే పాత్ర కోసం #Sharwa38 బృందం డింపుల్ హయాతిని గర్వంగా స్వాగతించింది.. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది’ అని రాసుకొస్తూ క్రేజీ బ్యూటీకి గ్రాండ్‌గా వెలకమ్ చెప్పింది.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. హయాతీ పెదవి కింద పెద్ద పుట్టుమచ్చ, పెద్ద ఫింగర్ రింగ్, చెవులకు దిద్దులు, ముక్కు పుడక పెట్టుకుంది. అలాగే మెడలో నెక్లెస్ కూడా వేసుకుంది. అయితే ముక్కుకు చేయి అడ్డంగా పెట్టుకుని ఫేస్ కనపడకుండా కవర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Next Story