- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాల్లో ఘాటుగా కానీ బయట మాత్రం చాలా సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చిన క్రేజీ బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
కెరీర్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి ఆ తర్వాత లేడీ స్టార్ విలన్‌గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించిన శ్రియ రెడ్డి(Sriya Reddy) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి ఆ తర్వాత లేడీ స్టార్ విలన్‌గా నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను కవ్వించిన శ్రియ రెడ్డి(Sriya Reddy) మనందరికీ సుపరిచితమే. తెలుగులో ‘అప్పుడప్పుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది.
రీసెంట్‌గా ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ‘సలార్’(Salar) సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ప్రజెంట్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ‘సలార్ 2’(Salar-2) సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’(OG) సినిమాలోనూ నటిస్తుంది. సుజిత్(Sujith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోనూ శ్రియ రెడ్డి విలన్ గా నటించనుందని టాక్. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా శ్రియరెడ్డి ఇన్‌స్టా(Instagram)లో కొన్ని శారీలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. బొట్టు, మెడలో నక్లెస్, జడ వేసుకుని చాలా సంప్రదాయకంగా కనిపించింది. ఇక వాటికి ‘ఫైండింగ్ యువర్ ఓన్ లైట్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను జోడిస్తూ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ శారీ ఫొటోస్‌ను మీరు కూడా ఓ సారి చూసేయండి.






