నాగ బంధం నుంచి క్రేజీ బ్యూటీ పోస్టర్ రిలీజ్.. మహారాణి లుక్‌లో ఆకట్టుకుంటున్న హీరోయిన్

by I. Sairam |

విరాట్‌కర్ణ(Virat Karna) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’(Naga Bandham).

నాగ బంధం నుంచి క్రేజీ బ్యూటీ పోస్టర్ రిలీజ్.. మహారాణి లుక్‌లో ఆకట్టుకుంటున్న హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్‌కర్ణ(Virat Karna) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’(Naga Bandham). అభిషేక్‌ నామా(Abhishek Nama) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్‌ అన్నపురెడ్డి(Kishore Annapu Reddy) నిర్మిస్తున్నారు. నభా నటేష్‌(Nabha Natesh), ఐశ్వర్యమీనన్‌(Aiswarya Menon), జగపతిబాబు(Jagapathi babu) తదితరులు నటిస్తున్న ఈ సినిమా పురాతన దేవాలయాలు, నిధుల అన్వేషణ నేపథ్యంలో ఒక పౌరాణిక యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ మూవీ పై అంచనాలు పెంచగా.. తాజాగా క్రేజీ బ్యూటీ నభా నటేష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. ‘రహస్యాలతో బంధించబడిన ప్రపంచంలో, ఆమె నమ్మకం విధిగా మారుతుంది.. నాగబంధం నుండి పార్వతిగా అందమైన నభా నటేష్‌ని పరిచయం చేస్తున్నాము.. ఈ సమ్మర్‌లో థియేటర్లలో పాన్-ఇండియా మూవీ నాగ బంధం విడుదల కానుంది’ అని రాసుకొచ్చారు.

ఇక పోస్టర్‌లో పార్వతి అనే పేరుకు తగ్గుట్టుగానే నభా పార్వతీ దేవీలా ఉంది. ఒంటినిండా నగలతో మహా రాణిని తలపిస్తుంది. ఇక పిట్టను ఎక్కడికి పోతున్నావు అన్నట్లుగా నభా సైగ చేస్తున్నది. ఆమె వెనక ఓ పెద్ద దేవాలయం, చెట్లూ వాటికి పూసిన పూలు, నెమలి అంతా చాలా డివోషనల్ వైబ్‌ను తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story