- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ స్టార్ విజయ్ సినిమాకు వీడని చిక్కులు..స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు చిక్కులు వీడలేదు. జన నాయగన్ చిత్రయూనిట్‌కు డివిజన్ బెంచ్‌లో షాక్ తగిలింది. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు చిక్కులు వీడలేదు. జన నాయగన్ చిత్రయూనిట్‌కు డివిజన్ బెంచ్‌లో షాక్ తగిలింది. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జననాయగన్ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కావాల్సివుంది. సినిమా జనవరి 9న విడుదల కానుందని చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది.
సెన్సార్ ఇవ్వకపోవడంతో సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా.. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని, సాయిధ ధళాలను అభ్యంతకర రీతిలో చూపించారని సెన్సార్ బోర్డు ఆరోపించింది. నేడు కోర్టులో ఈ అంశంపై విచరణ జరగ్గా డివిజన్ బెంచ్ స్టే విధించింది. అయితే జననాయగన్ విజయ్ చివరి సినిమా అన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇదే తన చివరి సినిమాగా ప్రకటించారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమ స్టార్ ను చివరిసారి తెరపై చూసుకోవాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. కానీ మరోసారి స్టే విధించడంతో వారికి నిరాశ తప్పలేదు.






