- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకుల తర్వాత మళ్లీ కలిసిన జంట.. ప్లీజ్ ఇలాగే ఉండండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్(వీడియో)
తమిళ సంగీత దర్శకుడు, సింగర్, హీరో అయినటువంటి జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: తమిళ సంగీత దర్శకుడు, సింగర్, హీరో అయినటువంటి జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి, పాడి, అలాగే సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇతని వ్యక్తిగత విషయానికి వస్తే.. జీవీ ప్రకాష్ తన చిన్ననాటి స్నేహితురాలైన సింగర్ సైంధవి(Saindhavi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఈ కపుల్‌కు ఒక పాప కూడా పుట్టింది. అయితే ఇండస్ట్రీలో ఈ జంటకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడెన్‌గా ఈ ఏడాది మే(May)లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్‌కు గురైనారు. అయితే తాజాగా ఈ జంట కలిసి కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
మలేషియాలోని ఓ సంగీత కచేరీలో పాల్గొన్న జీవీ ప్రకాశ్, సైంధవిలు జంటగా పాటలు ఆలపించారు. అది చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కచేరీ కోసం జీవీ ప్రకాశ్ రిహార్సల్స్ చేసేటప్పుడు కూడా సైంధవి.. తన కూతుర్ని తండ్రి దగ్గరకు పంపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్.. ప్లీజ్ మళ్లీ కలిసిపోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






