- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కపుల్ ఫ్రెండ్లీ.. రన్ టైమ్ ఎంతంటే..?
యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందులో భాగంగానే కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrashekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండగా.. అజయ్ కుమార్ రాజు పి నిర్మించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి (Manasa Varanasi) నటించింది. ఇప్పటికే కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వాలెంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న కపుల్ ఫ్రెండ్లీ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నట్లు ప్రకటించిన మేకర్స్.. హీరోహీరోయిన్ క్యూట్ పిక్‌తో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A 'A'(Adults Only) సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే అ మూవీ రన్ టైమ్ 2 గంటల 1 నిమిషం (121 నిమిషాలు). ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ హీరోహీరోయిన్ పిక్‌తో రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. మరి థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.






