- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరిహర వీరమల్లు నుంచి కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్.. ఫైర్ అండ్ ఫియర్‌లెస్‌నెస్ రాబోతుందంటూ పోస్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీనికి దర్శకులు జ్యోతి కృష్ణ(Jyothi Krishna) అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయిపోయింది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం(AM Ratnam) నిర్మాణం వహించారు.
అలాగే ఈ జూన్ 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ మూవీ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘ఇంకా 13 రోజులు మిగిలి ఉన్నాయి.. నిప్పు మరియు నిర్భయంలో చెక్కబడిన వారసత్వం. ధర్మ స్ఫూర్తి పెద్ద తెరపై ఉదయించనుంది.. జూన్ 12, 2025 నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో హరిహర వీరమల్లు రాబోతుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. పవన్ కళ్యాణ్ పొడవాటి మీసం, గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో గంభీరంగా కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్‌లో చార్మినార్‌తో పాటు రెండు కత్తులు ఉన్నాయి.






