బెంగళూరులో రజనీ సునామీ.... కొట్టుమిట్టాడుతున్న వార్ 2 ?

by velandi.Saikiran |

బెంగళూరు నగరంలో 1.94 లక్షల టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది. అటు ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 మూవీ టికెట్లు 13 వేలు

బెంగళూరులో రజనీ సునామీ.... కొట్టుమిట్టాడుతున్న వార్ 2 ?
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన సినిమా కూలీ. దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రజినీకాంత్ తో పాటు.. బడా స్టార్లు కూడా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర అలాగే శృతిహాసన్ లాంటి కీలక నటీనటులు మెరువనున్నారు. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున వార్ 2 సినిమా కూడా వస్తోంది.

బాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్తో వస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే.. హృతిక్ , కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా మెరువనున్నారు. అయితే.. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో వస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమమయ్యాయి. మొదటినుంచి.. రజినీ కాంత్ నటించిన కూలీ సినిమాకే జనాలు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కూలీ దెబ్బకు వార్ 2 ఏమాత్రం నిలబడేలా కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే.. బెంగళూరులో కూడా..కూలీ సినిమా తన హవాను చూపిస్తోంది.

ఇప్పటి వరకు బెంగళూరు నగరంలో 1.94 లక్షల టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది. అటు ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 మూవీ టికెట్లు 13 వేలు మాత్రమే అమ్ముడు అయ్యాయట. ఇప్పటివరకు బెంగళూరు నగరంలో 8 కోట్లకు పైగా కూలీ సంపాదించగా..వార్ 2 కు 70 లక్షలు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. బెంగళూరులో మొత్తం వెయ్యికి పైగా థియేటర్లలో కూలీ రిలీజ్ కానుండగా..వార్ 2 కు కేవలం 295 థియేటర్లు మాత్రమే లభించాయి అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌత్ ఇండియాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. ఇదే ట్రెండు కొనసాగితే...వార్ 2 సినిమా ఎక్కడ కనిపించబోదని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Next Story