- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిలీజ్‌కు ముందే కూలీ రికార్డు.. ప్రీమియర్స్‌తోనే 2 మిలియన్ క్లబ్‌లోకి..
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన కూలీ సినిమా విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ హవా కొనసాగింది.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన కూలీ సినిమా విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ హవా కొనసాగింది. ప్రీ బుకింగ్స్ ద్వారానే ఊహించని కలెక్షన్స్ రాబట్టిన కూలీ.. ప్రీమియర్స్ తో రెండు మిలియన్ల క్లబ్ లో చేరింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 7 లక్షల టికెట్లు బుక్ అయినట్లు కూలీ సినిమా టీమ్ వెల్లడించింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.70 కోట్ల కలెక్షన్లు రాగా.. తొలిరోజు రూ.100 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషిస్తుండటంతో అంచనాలు పెరిగాయి.
మరోవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా నటించిన వార్ -2 (war 2) సినిమా టికెట్ బుకింగ్స్ లో అంత జోరు కనిపించలేదు. ఇప్పటి వరకూ 60 వేల టికెట్స్ బుక్ అయ్యాయని, నేటి నుంచైనా బుకింగ్స్ పెరుగుతాయని ఆశిస్తున్నారు.






