Viral Video : అంత పెద్ద స్టార్ హీరోలను పెట్టి సినిమా చేస్తున్నారా.. హెయిర్ ఫాల్ యాడ్ చేస్తున్నారా.. ఏంది ఆ వీడియోలు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-08 12:27:55  IST  )

సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ ఫిల్మ్ ‘కూలీ’ భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన సినిమాను కళానిధి మారన్ నిర్మించగా.. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్

Viral Video : అంత పెద్ద స్టార్ హీరోలను పెట్టి సినిమా చేస్తున్నారా.. హెయిర్ ఫాల్ యాడ్ చేస్తున్నారా.. ఏంది ఆ వీడియోలు..
X

దిశ, ఫీచర్స్ : సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ ఫిల్మ్ ‘కూలీ’ భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన సినిమాను కళానిధి మారన్ నిర్మించగా.. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ మధ్య స్టార్ కాస్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా బ్యాక్ షాట్స్‌తో క్యారెక్టర్ రివీల్ చేశారు. ప్రతీ ఒక్కరి రోల్ రివీల్ కూడా ఇదే విధంగా చేయడంతో.. మీమ్స్ పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇందులో స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది హిలేరియస్ మీమ్. ముందుగా ఒత్తుగా ఉన్న జుట్టు నాగార్జున నుంచి రాలిపోయి చివరి స్టేజ్‌లో ఉన్న ఓ సపోర్టింగ్ యాక్టర్ జుట్టును కంపేర్ చేస్తూ ఈ మీమ్ క్రియేట్ చేశారు. ఫైవ్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ అంటూ ఫన్ క్రియేట్ చేశారు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. రజనీ ఒరిజినల్ హెయిర్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయిరా అని నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఇంత పెద్ద స్టార్స్‌తో సినిమా చేస్తున్నారా లేక హెయిర్ ఫాల్ యాడ్ చేస్తున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ విషయం పక్కనపెడితే.. ఈ మూవీ బడ్జెట్ రూ. 400 కోట్లకు చేరుకుందని టాక్. రజనీకాంత్ రూ. 260 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని.. ఇది కేజీఎఫ్ బడ్జెట్‌కు మూడు రెట్లు ఎక్కవ అని పోలుస్తున్నారు. మొత్తానికి ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న నటుడిగా రజనీకాంత్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story