- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ థియేటర్‌లో కూలీ సినిమా టికెట్ రూ.4500.. ఎందుకంత స్పెషల్ అంటే?
స్టార్ హీరో రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున, రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
హీరో రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అంతే కాకుండా ఇప్పటికే తమిళనాట అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా టికెట్ల కోసం అభిమానులు, మూవీ లవర్స్ ఎగబడుతున్నారు. రీసెంట్ గా ఓ థియేటర్ వద్ద గేట్లు తీయగానే అభిమానులు టికెట్ల కోసం ఎలా పరిగెత్తారో దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది.
కూలీ సినిమా టికెట్ ధరను ఓ థియేటర్ లో ఏకంగా రూ.4500కు పెంచేశారు. తమిళనాడులోని రోహిణి థియేటర్‌లో ఈ ధరను నిర్ణయించారు. అయితే అందుకు ఓ కారణం కూడా ఉంది. సినిమా విడుదల రోజున థియేటర్ వద్ద హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తారట. అందుకే ఆ ఒక్క రోజు టికెట్ ధర రూ.4500లకు పెంచారు. ఇంత ధరకు టికెట్ అమ్మడం కోలీవుడ్ లో ఇదే మొదటిసారి అని మూవీలవర్స్ చెబుతున్నారు. మరి అంత ధర పెట్టి ఎంతమంది అభిమానులు సినిమాను రోహిణి థియేటర్ లో చూస్తారో చూడాలి.






