- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కూలీ’ సినిమా టికెట్ రేట్ల పెంపు.. రాజమౌళిని ఏకిపారేస్తున్న నెటిజన్లు..
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. నాగార్జున విలన్‌గా కనిపించోతున్న సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ లాంటి స్టార్స్ కూడా నటించారు. అయితే

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. నాగార్జున విలన్‌గా కనిపించోతున్న సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ లాంటి స్టార్స్ కూడా నటించారు. అయితే ఈ మూవీ రిలీజ్ తెలుగు ఆడియన్స్‌ను టార్గెట్ చేసింది. తమిళ్ స్ట్రెయిట్ ఫిల్మ్ అయిన ‘కూలీ’..తెలుగులో డబ్ చేయబడుతోంది. కానీ తమిళనాడుతో పోలిస్తే తెలంగాణలోనే టికెట్ హైక్ ఎక్కువ ఉంది. చెన్నై పీవీఆర్‌లో టికెట్ రూ. 183 ఉంటే హైదరాబాద్ పీవీఆర్‌లో ఏకంగా రూ. 453 ఉంది. అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అదే సింగిల్ స్క్రీన్స్ విషయంలో కూడా కొనసాగుతోంది. దీంతో డబ్ సినిమాలకు కూడా ఇంత హైక్ ఇందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇదే కొన్నాళ్లు కొనసాగితే ఆడియన్స్ మూవీస్‌ను బాయ్ కాట్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే దీనంతటికి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేల కోట్ల బడ్జెట్‌లో సినిమాలు తెరకెక్కించి టికెట్ హైక్ అడిగే కల్చర్‌కు పునాది వేసింది ఆయనే అని అంటున్నారు. అసలు వేల కోట్లు పెట్టి సినిమాలు చేయమని ప్రేక్షకులు అడిగారా.. టికెట్ రేట్స్ పెంచమని కోరారా అని గట్టిగా ఏకిపడేస్తున్నారు. నిర్మాతలు కూడా ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలను తీసే ముందు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.






