పాకిస్తాన్ పాపతో కనిపించి బిగ్ షాకిచ్చిన మహేష్ బాబు తనయుడు.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే? (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-25 05:57:58  IST  )

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో ఏకంగా 26 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

పాకిస్తాన్ పాపతో కనిపించి బిగ్ షాకిచ్చిన మహేష్ బాబు తనయుడు.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే? (వీడియో)
X

దిశ, సినిమా: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో ఏకంగా 26 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ దాడి పక్కా పాకిస్తాన్ వాళ్లు ప్లాన్ చేసి మరీ చేయించారనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక పహల్గాం దాడికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో యావత్ భారతదేశం ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఇక వారిని వదిలిపెట్టొద్దని మళ్లీ దాడి చేయాలని నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

అంతేకాకుండా పాకిస్తాన్‌ను వెళ్తున్న నీటి సరఫరాను ఆపేశారు. అక్కడి నటీనటులను కూడా బ్యాన్ చేశారు. అయితే పాకిస్తాన్‌పై యుద్ధం చేయడానికి భారత్ సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ సంచలన వీడియో చర్చనీయాంశంగా మారింది. అది మరెవరిదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తనయుడు గౌతమ్(Gautam) వీడియో. పాకిస్తాన్ అమ్మాయితో కలిసి కనిపించడంతో అది చూసిన వారంతా ఫుల్ ఫైర్ అవుతున్నారు. గౌతమ్ కొద్ది కాలంగా విదేశాల్లో చదువుకుంటూనే యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే.

అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంటారు. అయితే రీసెంట్‌గా ఆయన ఇండియా క్రికెట్ జెర్సీని ధరించి, పాకిస్తాన్ క్రికెట్ జెర్సీని ధరించిన అమ్మాయితో కలిసి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసినట్లు తెలుస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు చాలా క్యూట్‌గా ఉన్నారు అని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి సమయంలో ఇలాంటివి అవసరమా? వివాదాలకు దారి తీయకుండా ఉంటే చాలు అని అంటున్నారు.

Next Story