Ram Gopal Varma: ఈ ఒక్క సినిమాతో నా పాపాలు కడిగేసుకుంటా.. కాంట్రవర్సీ డైరెక్టర్ సంచలన పోస్ట్

by Chukka Sudharani |

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal varma) తెరకెక్కించిన సెన్సేషనల్ (Sensational) చిత్రాల్లో ‘సత్య’ (satya) ఒకటి.

Ram Gopal Varma: ఈ ఒక్క సినిమాతో నా పాపాలు కడిగేసుకుంటా.. కాంట్రవర్సీ డైరెక్టర్ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal varma) తెరకెక్కించిన సెన్సేషనల్ (Sensational) చిత్రాల్లో ‘సత్య’ (satya) ఒకటి. వర్మ రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్ పేయి, ఊర్మిళ మండోద్కర్, షెఫాలీ షా, అరుణ్ బాలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ‘సత్య’ చిత్రం 1998లో రిలీజై బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన హిట్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాను ఉద్దేశిస్తూ.. ఇప్పుడు సత్య లాంటి చిత్రం తీయాలని నిర్ణయించుకున్నానని వర్మ సోషల్ మీడియా (Social media) వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ (Interesting post) పెట్టాడు.

‘‘సత్య’ చిత్రంపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను. సినిమా పేరు సిండికేట్. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే భయంకరమైన సంస్థ గురించి వివరిస్తుంది. కాన్సెప్ట్ వచ్చేసి.. 70వ దశకం వరకు విజృంభించిన స్ట్రీట్ గ్యాంగ్‌లు కరడుగట్టిన రాజకీయ పార్టీలలోకి ప్రవేశించి, తరువాత ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మొదలైన వాటికి విపరీతమైన డిమాండ్ కారణంగా స్మగ్లర్లు పెరిగినప్పుడు, వాటిని కూడా ఆర్థిక సంస్కరణలు నాశనం చేశాయి. ఆపై ఘోరమైన కార్పొరేట్ ముఠాలుగా మారాయి. వీటిపైనే ఈ సినిమా ఉంటుంది. సిండికేట్ (Syndicate) చిత్రం ‘ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు’ అనే ప్రకటనతో ప్రారంభమవుతుంది. సిండికేట్ చాలా భయానక చలనచిత్రంగా ఉంటుంది. ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. తారాగణం అండ్ ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించబడతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్‌గా మారింది.


Next Story